: తమిళనాడులో ఎమ్మెల్యేలను ఉంచిన గోల్డెన్ బే రిసార్ట్స్ కు బయలుదేరిన డీజీపీ
తమిళనాడులో క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. గోల్డెన్ బే రిసార్ట్స్ ను పూర్తిగా స్వాధీనం చేసుకొని శశికళ నటరాజన్ అనుచరులు ఎమ్మెల్యేలను బంధించారన్న అనుమానాలు తీవ్రతరం అయిన నేపథ్యంలో ఆ రాష్ట్ర డీజీపీ రాజేంద్ర సదరు రిసార్ట్స్‌కి బయలుదేరారు. ఎమ్మెల్యేల బందీ ఆరోపణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ ఆరోపణలపై దర్యాప్తు ముమ్మరమైంది. మరోవైపు నిన్న ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా ఎమ్మెల్యేలను బయటకు తీసుకురావాలని ఆదేశించారు. మరికాసేపట్లో డీజీపీ సదరు రిసార్ట్స్‌కి చేరుకొని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో స్వయంగా మాట్లాడనున్నారు.