: గవర్నర్ తో భేటీ సందర్భంగా పన్నీర్ సెల్వం ఏం మాట్లాడారు...?


తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు తో ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్వీర్ సెల్వం గురువారం సాయంత్రం 15 నిమిషాల పాటు భేటీ అవగా... ఆ సందర్భంగా ఆయన జరిపిన సంభాషణ వివరాలు తాజాగా వెలుగు చూశాయి. తనకు ఐదు రోజుల సమయం ఇవ్వాలని పన్నీర్ సెల్వం ఈ సందర్భంగా గవర్నర్ ను కోరినట్టు తెలిసింది. అన్నాడీఎంకే శాసనసభ్యుల మద్దతు కూడగట్టడానికి వీలుగా ఆయన ఇన్ని రోజుల సమయం అడిగారు. అన్నాడీఎంకే శాసనసభ్యులు శశికళ నిర్బంధంలో ఉన్నారని పేర్కొన్నారు.

అసెంబ్లీలో శశికళను బలాన్ని నిరూపించుకోవాలని కోరడానికి ముందు తనకు ఓ అవకాశం ఇవ్వాలని పన్నీర్ సెల్వం గవర్నర్ కు కోరారు. తనకు 130కిపైగా ఎమ్మెల్యేల బలం ఉందని శశికళ వాదన వినిపిస్తుండగా, ఎమ్మెల్యేలు సంతకం చేసిన ఖాళీ పేపర్లను ఆమె తీసుకున్నారని, వాటిని ఇప్పుడు తనకు అనుకూలంగా వాడుకుంటున్నారనే ఆరోపణలు పన్నీర్ వర్గం నుంచి వినిపిస్తున్నాయి. అసలు శశికళ చెబుతున్న జాబితాలో కొందరు ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీ చేసినవనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

  • Loading...

More Telugu News