: శశికళ క్యాంపులోని ఎమ్మెల్యేల ఫుడ్ మెనూ పెద్దదే! తిన్నోడికి తిన్నంత, తాగినోడికి తాగినంత!


తమ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు అక్కడ నుంచి తప్పించుకుని... పన్నీర్ సెల్వంకు మద్దతు పలకకుండా శశికళ మనుషులు, మన్నార్ గుడి మాఫియా అన్ని చర్యలూ తీసుకుంటోంది. మరోవైపు వారికి సకల సదుపాయాలు కల్పిస్తోంది. బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, వడ, పొంగల్, దోశ, పూరీలాంటివి అందిస్తున్నారు. మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చేపలు, బిర్యానీ, రకరకాల కూరలు, థాలీ, డెజర్టులు తదితరాలు ఉంటున్నాయి.

వీటికి తోడు మద్యం సేవించే వారి కోసం రకరకాల మద్యం అందుబాటులో ఉంది. తిన్నోడికి తిన్నంత, తాగినోడికి తాగినంత. ఇంత ఉన్నా... అక్కడ చీమ చిటుక్కుమన్నా శశికళ మనుషులు ప్రత్యక్షం అవుతున్నారట. దీనికి తోడు అరగంటకోసారి కాఫీలు, టీలు అంటూ అక్కడకు వెళ్లి... ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఈ వ్యవహారం పలువురు ఎమ్మెల్యేలకు ఆగ్రహం తెప్పిస్తోందని... కొన్ని సార్లు గొడవ కూడా చేశారని సమాచారం.


  • Loading...

More Telugu News