: అలంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు... భారీ జనసందోహం
తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు పోటీలు మదురై జిల్లా అలంగనల్లూరులో ఈ రోజు భారీ ఏర్పాట్ల నడుమ ప్రారంభమయ్యాయి. సుమారు వెయ్యి ఎద్దులు పోటీలకు తరలివచ్చాయి. సుమారు 1700 మంది యువకులు వాటితో పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. గురువారం ఇక్కడికి 25 కిలోమీటర్ల దూరంలో పలమనేడు వద్ద జరిగిన జల్లికట్టులో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో నేటి పోటీలకు భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ పోటీలు జరిగే ప్రాంతాన్ని సందర్శించారు. జల్లికట్టు పోటీలకు అనుమతి ఇవ్వడానికి సుప్రీంకోర్టు జనవరిలో నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా జల్లికట్టుకు మద్దతుగా తమిళనాడు వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. చెన్నై మెరీనాబీచ్ సైతం జల్లికట్టు మద్దతుదారులతో నిండిపోయిన విషయం తెలిసిందే.