: మీరూ బాహుబలిగా మారొచ్చు.. కాలకేయుడిని చీల్చి చెండాడొచ్చు!
అవును! మీరు కూడా బాహుబలిగా మారిపోవచ్చు. కాలకేయుడి అంతు చూడొచ్చు. అయితే ఇదంతా గేమ్ ద్వారానే సాధ్యం. అతి త్వరలో బాహుబలి సినిమా ఆధారంగా ఓ మొబైల్ గేమ్ అందుబాటులోకి రానుంది. మార్క్ సాగ్స్ దానిని అభివృద్ధి చేయనున్నారు. గతంలో ‘ఫార్మ్‌విల్లే’, ‘లార్డ్ ఆఫ్ రింగ్స్’ వంటి గేమ్‌లను మార్క్‌సాగ్స్ రూపొందించారు. బాహుబలి గేమ్ రూపకల్పనపై దర్శకుడు రాజమౌళితో మార్క్‌సాగ్స్ చర్చించారు. త్వరలోనే ఈ గేమ్ అందుబాటులోకి రాబోతోందంటూ ‘బాహుబలి’ ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు.