: పన్నీర్‌కు జై కొడుతున్న 95 శాతం మంది.. ఆన్‌లైన్ సర్వేలో వెల్లడి
తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎవరు కొనసాగాలంటూ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో 95 శాతం మంది పన్నీర్ సెల్వానికే పట్టం కట్టారు. 52 వేల మంది పాల్గొన్న ఈ సర్వేలో నెటిజన్లలో అత్యధికశాతం పన్నీర్‌కే మద్దతు తెలిపారు. ‘తమిళనాడుకు నాయకత్వం వహించేందుకు గౌరవ ముఖ్యమంత్రి తన పదవిలో కొనసాగాలా?’ అన్న ప్రశ్నను ఆన్‌లైన్‌లో ఉంచగా అత్యధికులు పన్నీర్‌కే ఓటేశారు. 'సీఎంవో తమిళనాడు' నిర్వహిస్తున్న పన్నీర్ సెల్వం ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సర్వేను నిర్వహించారు.