: సాఫ్ట్‌వేర్ రంగంలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న నోకియా.. కాంప్‌టెల్‌కు రూ.2470 కోట్ల ఆఫర్


స్మార్ట్‌ఫోన్ల తయారీలో వెనకబడి దాదాపు మొబైల్ ఉత్పత్తి రంగం నుంచి తప్పుకున్న నోకియా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ రంగంలో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా నెట్‌వర్క్ పరికరాల తయారీ సంస్థ కాంప్‌టెల్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఆ సంస్థకు రూ.2470 కోట్ల భారీ ఆఫర్ ప్రకటించింది. ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ఈ కంపెనీ ఒక్కో షేర్‌ను 3.04 యూరోలకు కొనుగోలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇది కాంప్‌టెల్ గత ముగింపు షేర్ ధర కన్నా ఎంతో ఎక్కువ. నోకియా ఆఫర్‌పై కాంప్‌టెల్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు.

  • Loading...

More Telugu News