: ఆ సంతకాలన్నీ ఫోర్జరీ చేసినవే!: ‘పన్నీర్’ మద్దతుదారుడు మైత్రేయన్


అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా ఉన్నారంటూ వారి సంతకాలతో కూడిన మద్దతు లేఖలను గవర్నర్ విద్యాసాగర్ రావుకు శశికళ సమర్పించడంపై పన్నీర్ సెల్వం మద్దతుదారుడు, రాజ్యసభ సభ్యుడు వి.మైత్రేయన్ మండిపడ్డారు. ఆ సంతకాలన్నీ ఫోర్జరీ చేసినవే అని, ఎమ్మెల్యేలు తమంత తాముగా చేసినవి కాదని ఆరోపించారు. ప్రస్తుత సంక్షోభానికి పరిష్కారం అసెంబ్లీలో బల నిరూపణ చేయడమేనని, పార్టీ మొత్తం పన్నీర్ సెల్వం వెంట ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పరిస్థితులను అనుసరించి ఎటు కావాలంటే అటు మొగ్గేందుకు ఎమ్మెల్యేలు సానుకూలంగా ఉన్నారని, తమిళనాడులో రాజకీయ సంక్షోభం విషయమై కేంద్రం తన నైతిక మద్దతు ఇవ్వవచ్చని, రాజకీయ మద్దతు కాదని మైత్రేయన్ అన్నారు.

  • Loading...

More Telugu News