: జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించిన కారు.. 8 మంది మహిళల మృతి
వేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న మహిళలపైకి దూసుకెళ్లిన ఘోర ప్రమాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఝాన్సీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 8 మంది మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర ఆగ్రహానికి గురయిన స్థానికులు ఆ కారును ధ్వంసం చేశారు. వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్న స్థానిక పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.