: నటి సమంతను పోలిన తెలుగు అమ్మాయి!
దక్షిణాది ముద్దుగుమ్మ సమంతకు తాను ఏమాత్రం తీసుపోనంటోంది అషురెడ్డి అనే తెలుగు అమ్మాయి. పోలికల విషయంలో ‘సమంత’లానే తానూ ఉన్నానని అంటూ తన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. అంతే కాకుండా, పలు చిత్రాల్లో సమంత చెప్పిన డైలాగ్ లకు డబ్ స్మాష్ చెప్పి ఆ వీడియోలనూ పోస్ట్ చేస్తోంది. అయితే, సమంత పోలికలు ఈ అమ్మాయిలో కనిపిస్తుండటంతో ఆమె ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.