: తమిళనాడులో జరుగుతున్నది మంచా?చెడా? అనేది చెప్పలేను: రోశయ్య


తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై  ఆ రాష్ట్ర మాజీ గవర్నర్, కాంగ్రెస్ పార్టీ నేత రోశయ్య స్పందించారు. ఇక్కడ జరుగుతున్నది మంచా?చెడా? అని తాను చెప్పలేనని, ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. తమిళనాడులో ఈ తరహా పరిస్థితులు తలెత్తడం కొత్తేమీ కాదని అన్నారు. ప్రస్తుత సమస్యను గవర్నర్ విద్యాసాగర్ రావు చక్కగా పరిష్కరిస్తారని అన్నారు. వేచి చూస్తే నిర్ణయం తెలుస్తుందని, గవర్నర్ నిర్ణయం ప్రకటించాక పరిస్థితి సద్దుమణుగుతుందని భావిస్తున్నానని రోశయ్య అన్నారు.

  • Loading...

More Telugu News