: రెండు రోజుల్లో శశికళ కథ ముగిసిపోతుంది: పాండ్యన్


తమిళనాడులో శశికళ వ్యతిరేక వర్గం బలం పెరుగుతోంది. ఈ క్రమంలో, పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన అన్నాడీఎంకే నేత పాండ్యన్ మరోసారి శశికళపై నిప్పులు చెరిగారు. రానున్న రెండు రోజుల్లో శశికళ కథ ముగిసిపోతుందని ఆయన అన్నారు. తాను ఎన్నటికీ రాజకీయాల్లోకి రానని, తనకు రాజకీయ పదవుల పట్ల ఆసక్తి లేదంటూ జయలలితకు 2012లో శశికళ లేఖ రాశారని చెప్పిన ఆయన... ఇప్పుడెందుకు ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని ప్రశ్నించారు. తామంతా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తమిళ ప్రజలంతా శశికళకు బుద్ధి చెబుతారని అన్నారు. 

  • Loading...

More Telugu News