: సీఎంగా పన్నీర్ సెల్వం చాలా బాగా పనిచేశారు: బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలు
సీఎంగా పన్నీర్ సెల్వం చాలా బాగా పని చేశారని బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలు తమిలిసాయి సౌందర రాజన్ కితాబిచ్చారు. ఈ రోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ, సీఎం కుర్చీలో నుంచి పన్నీర్ సెల్వంను పక్కన పెట్టి ఆ పదవి పొందేందుకు కొందరు గందరగోళం సృష్టిస్తున్నారంటూ, శశికళ పేరును ప్రస్తావించకుండా విమర్శించారు. ప్రజల మద్దతు పన్నీర్ కే ఉందని, అయితే, ప్రజాస్వామ్యంలో నాయకుల బలాబలాలను సంఖ్యను బట్టి నిర్దారించడం దురదృష్టకరమన్నారు. తమిళనాడులో రాజకీయ అనిశ్చితి నెలకొన్న వెంటనే గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నైకి రాకుండా మంచి పని చేశారని ఆమె తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో తమిలిసాయి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.