: ‘5జీ’ లోగో విడుదల!
ప్రపంచంలో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో ఈ ఏడాది ద్వితీయార్థంలో ‘5జీ’ నెట్ వర్క్ అందుబాటులోకి రానుంది. అయితే, ప్రయోగాత్మకంగా ఆయా ప్రాంతాల్లో అందుబాటులోకి రానున్న ఈ నెట్ వర్క్ లోగోను విడుదల చేశారు. మొబైల్ నెట్ వర్క్ టెక్నాలజీలను రూపొందించి, నిర్వహించే థర్డ్ జనరేషన్ పార్టనర్ షిప్ (3 జీపీపీ) ‘5జీ’ లోగోను విడుదల చేసింది. ‘4జీ’లోగోనే ఈ 5జీ’ లోగో పోలి ఉన్నప్పటికీ, స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ‘5జీ’లోగోలో ఆకుపచ్చ రంగులో మూడు వేవ్స్ ఉండటంతో పాటు వాటి షేప్ లో కూడా కొంత మార్పు గమనించవచ్చు. వచ్చే ఏడాది నుంచి ‘5జీ’ నెట్ వర్క్ అధికారికంగా లభించే అవకాశం ఉందని, 2020 నాటికి ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని సమచారం. కాగా, ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ‘4జీ’ అందుబాటులో ఉంది.