: రాజ్ భవన్ ముందు దీప అనుచరుల ఆందోళన, అరెస్టు
తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చిన నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప అనచరులు ఆందోళనకు దిగారు. దీపకు కూడా గవర్నర్ అపాయింట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చెన్నైలోని రాజ్ భవన్ ముందు వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసులు దీప అనుచరులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.