: మునిసిపల్ ఎన్నికల బరిలోకి దిగిన ఆ అభ్యర్థి ఆస్తుల విలువ అక్షరాల రూ.690 కోట్లు!
ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలలో నిలబడుతున్న సందర్భంగా నామినేషన్ వేయడానికి ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వచ్చిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఒకరు తెలిపిన ఆస్తుల వివరాలు చూసిన అధికారులు షాక్ అయ్యారు. ఆ అభ్యర్థి తన ఆస్తుల విలువ రూ.690 కోట్లుగా పేర్కొన్నారు. వాటిలో రూ.670 కోట్లు చరాస్తులు కాగా, రూ.20 కోట్లు స్థిరాస్తులు ఉన్నాయి. పరాగ్ షా అనే ఈ అభ్యర్థి ఘట్కోపార్ ప్రాంతం నుంచి పోటీలోకి దిగారు. ఆయన మహారాష్ట్ర మంత్రి ప్రకాశ్ మెహతాకు సన్నిహితుడు. రియల్టర్ అయిన ఆయన పలు రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులు చేబడుతుంటారు.