: పన్నీర్ కు అడ్వాంటేజ్... శశికళకు ఇచ్చిన టైమ్ లో పన్నీర్ కు అపాయింట్ మెంట్
తమిళనాడు రాజకీయాల్లో మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వాస్తవానికి ఈ సాయంత్రం 5 గంటలకు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావుతో శశికళకు అపాయింట్ మెంట్ ఉంది. కానీ, 5 గంటలకు వచ్చి కలవాలంటూ పన్నీర్ సెల్వంకు రాజ్ భవన్ నుంచి సమాచారం అందింది. ఆ తర్వాత సాయంత్రం 7.30 గంటలకు శశికళ వర్గానికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలో, శశికళకన్నా ముందుగానే గవర్నర్ తో మాట్లాడి, ఆయన ఎదుట తన బలాన్ని నిరూపించుకునే అవకాశం పన్నీర్ కు దక్కింది. వాస్తవానికి ఇరు వర్గాలను కూడా రాజ్ భవన్ ఇంతవరకు ఒకే దూరంలో ఉంచింది. కానీ, ఊహించని విధంగా పన్నీర్ కు మొదటి అపాయింట్ మెంట్ దొరకడంతో, టెక్నికల్ గా పన్నీర్ వర్గానికి అడ్వాంటేజ్ లభించినట్టైంది. రాజ్ భవన్ నుంచి అందిన సమాచారంతో పన్నీర్ శిబిరం ఆనందంలో మునిగిపోయింది.