: ఛ.. ఇలాంటి విషయాల్లో జోక్ చేస్తానా?: ట్రంప్
మెక్సికో సరిహద్దులో గోడ కట్టి తీరుతామని అమెరికా అధ్యక్షుడు మరోసారి స్పష్టం చేశారు. కౌంటీ షెరిఫ్స్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, గోడ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ ప్రక్రియ మొదలైందని చెప్పారు. గోడను నిర్మించే విషయంలో తాను జోక్ చేస్తున్నానని చాలా మంది అనుకుంటున్నారని... కానీ తాను జోక్ చేయడం లేదని తెలిపారు. ఇలాంటి సీరియస్ విషయాల్లో తాను జోక్ చేయనని చెప్పారు. ఈ గోడ చాలా పెద్దగా ఉంటుందని... దీని వల్ల అమెరికాలోకి అక్రమ వలసలు, డ్రగ్స్ సరఫరా తగ్గిపోతుందని తెలిపారు. గోడలు ఫలితాన్ని ఇస్తాయా అని కొందరు ప్రశ్నిస్తున్నారని... ఈ విషయం గురించి ఇజ్రాయెల్ ను అడిగితే, సరైన సమాధానం దొరుకుతుందని సూచించారు. సరైన విధానంతో నిర్మిస్తే, కచ్చితమైన ఫలితాలు ఉంటాయని చెప్పారు. అమెరికాలోని ప్రతి పౌరుడు ప్రేమ పూరిత వాతావరణంలో నివసించేలా చేయడమే తన లక్ష్యమని తెలిపారు.