: ఇద్దరు ఎమ్మెల్యేలను తీసుకుని పన్నీర్ గూటికి చేరిన అన్నాడీఎంకే ప్రిసీడింగ్ చైర్మన్ మధుసూదనన్


గంటగంటకూ పన్నీర్ సెల్వంకు మద్దతు పెరుగుతోందన్న సంకేతాలకు బలం చేకూరుస్తూ, అన్నాడీఎంకే పార్టీ ప్రిసీడింగ్ చైర్మన్ మధుసూదనన్ పన్నీర్ సెల్వం గ్రూప్ లోకి వాలిపోయారు. నిన్న శశికళ వర్గంలో కనిపించి, క్యాంపు రాజకీయాల్లో భాగంగా కనిపించకుండా పోయిన ఆయన, నేడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సహా తప్పించుకుని కొద్దిసేపటి క్రితం పన్నీర్ చెంతకు చేరారు. శశికళ వర్గం నుంచి జారుకున్న మధుసూదనన్ నేరుగా పన్నీర్ ఇంటికి వెళ్లి మాట్లాడారు. క్యాంపులోని మరింత మంది అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు ఆయన తెలిపారని సమాచారం. కాగా, రెండు రోజుల క్రితం అమ్మ ఆత్మ తనతో మాట్లాడిందని చెప్పిన పన్నీర్, పార్టీ జనరల్ సెక్రటరీగా మధుసూదనన్ ను నియమించాలని సూచించినట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News