: శశికళకు చుక్కలు చూపిస్తోన్న పన్నీర్ సెల్వం.. ఎమ్మెల్యేలందరినీ బయటకు తీసుకురావాలని కీలక ఆదేశాలు జారీ
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి పావులు కదుపుతున్న అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ నటరాజన్‌కు ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చుక్కలు చూపిస్తున్నారు. ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ ఇన్నాళ్లు తాను ప్రదర్శించిన వ్యవహారశైలికి భిన్నంగా కనిపిస్తున్నారు. తాజాగా ఆయన ఆ రాష్ట్ర డీజీపీ రాజేంద్ర, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి గిరిజాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. చెన్నయ్ నగర పోలీస్ కమీషనర్‌ను బదిలీచేయాలని ఆదేశించడంతో పాటు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరూ ఎక్కడ ఉన్నా బయటకు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పన్నీర్ సెల్వంకి బలం క్రమంగా పెరుగుతూ వెళుతోంది.