: మనోహర్ పారికర్‌కు ఫోన్ చేసిన అమెరికా రక్షణ శాఖ మంత్రి.. కీలక చర్చలు
అమెరికా, భారత్‌కు మధ్య సత్సంబంధాలు మరింత బలపడుతున్నాయి. అమెరికా రక్షణ శాఖ మంత్రితో భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తొలిసారి మాట్లాడారు. ఆ దేశ రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ తాజాగా పారికర్ కు ఫోన్ చేసి పలు కీలక అంశాలపై చర్చించారు. ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాలపై ముందుకు వెళ్లేందుకు ఇరువురు మంత్రులు ఒప్పుకున్నారు. వాటిపై ప్రగతిని సాధిస్తూ మరింత ముందుకు వెళ్లాలని వారు నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, భద్రత అంశంలో భారత్ పోషిస్తోన్న పాత్రను అమెరికా రక్షణ మంత్రి ప్రశంసించారు. ఈ అంశంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. అలాగే డిఫెన్స్ టెక్నాలజీ, ఇరు దేశాల వాణిజ్య బంధాల బలోపేతంపై దృష్టి పెట్టాలని ఇద్దరు నిర్ణయించారు.