: కొనసాగుతున్న ఉత్కంఠ.. పన్నీర్ సెల్వంతో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేల భేటీ
తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఓ వైపు శశికళ నటరాజన్‌కు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలు గోల్డెన్ బే రిసార్ట్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. వారిని ఎవ్వరూ కలవడానికి వీలు లేకుండా శశికళ వర్గీయులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన నివాసంలో పలువురితో భేటీ అవుతూ బిజీబిజీగా ఉన్నారు. కాసేపటి క్రితం పలువురు అధికారులతో చర్చించి, పలు ఆదేశాలు జారీ చేసిన పన్నీర్ సెల్వం... ప్రస్తుతం ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అన్నాడీఎంకే పార్టీలో తన వైపునకు మద్దతు పెరిగేలా తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలపై ఆయన ఆ ముగ్గురు నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం.