: మరో వికెట్ పోకుండా లంచ్ వరకూ కాపాడిన విజయ్, పుజారా
హైదరాబాద్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో ఆదిలోనే కెఎల్ రాహుల్ వికెట్ కోల్పోయిన భారత జట్టును మురళీ విజయ్, ఛటేశ్వర్ పుజారాలు ఆదుకున్నారు. ఆచితూచి ఆడుతూ, మరో వికెట్ కోల్పోకుండా లంచ్ విరామ సమయం వరకూ నిలిచారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలకు దగ్గరయ్యారు. లంచ్ సమయానికి భారత జట్టు స్కోరు 86 పరుగులకు చేరింది. లంచ్ తరువాతి సెషన్ ఆట ప్రారంభం కాగా, విజయ్ 45 (78 బంతుల్లో 6 ఫోర్లతో), పుజారా 39 (87 బంతుల్లో 4 ఫోర్లతో) పరుగులతో ఆడుతున్నారు. ప్రస్తుతం భారత స్కోరు 28 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 87 పరుగులు.