: విందులు, వినోదాలు... నిన్న రాత్రంతా ఫుల్లుగా ఎంజాయ్ చేసిన శశికళ వర్గం ఎమ్మెల్యేలు


తమిళనాడు ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ శశికళకు మధ్య పోరు మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. నిన్న సాయంత్రం త‌న‌కు మ‌ద్దతుగా ఉన్నార‌ని ప్ర‌క‌టించిన 130 మంది ఎమ్మెల్యేలను శ‌శిక‌ళ ప్రత్యేక బస్సు‍ల్లో వేర్వేరు ప్రాంతాలకు తరలించిన విష‌యం తెలిసిందే. అయితే, వారంతా నిన్న రాత్రి ఆయా లగ్జరీ హోటల్స్‌లలో బస చేసి ఫుల్లుగా ఎంజాయ్ చేశార‌ట‌. ఆయా హోట‌ళ్ల‌లో విందులు, వినోదాలు ఏర్పాటు చేసుకొని హ్యాపీగా గ‌డిపార‌ట‌. శ‌శిక‌ళ పంపిన ఎమ్మెల్యేల‌లో ఒక బృందం ఓ మీడియాకు క‌నిపించింది.

వారిని చెన్నైకు 80 కిలోమీటర్ల దూరంలోని మహాబలిపురానికి తీసుకెళ్లారని ఆ మీడియా పేర్కొంది. అక్కడ వారిని గోల్డెన్‌ బే రిసార్ట్‌కు తీసుకెళ్లి బీచ్‌, మసాజులు, వాటర్‌ స్కైయింగ్ వంటి సౌక‌ర్యాలు అందించార‌ట‌. ఎటువంటి టెన్ష‌న్లు లేకుండా వారంతా త‌మ‌ ఫోన్లను పక్కకు పడేసి మ‌రీ ఫుల్లుగా ఎంజాయ్ చేశార‌ని స‌ద‌రు మీడియా తెలిపింది. ఆ బృందంలోని ఎస్పీ షణ్ముగనాథన్‌ అనే వ్యక్తి మాత్రం బాత్‌ రూం బ్రేక్‌ అని చెప్పి బ‌య‌ట‌కు వెళ్లి మ‌ళ్లీ వెన‌క్కురాలేద‌ట‌. అయితే, అత‌డే ప‌న్నీర్ సెల్వంకు అత్యంత న‌మ్మ‌క‌స్తుడ‌ని పేర్కొంది.

  • Loading...

More Telugu News