: ముందుగా శశికళతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించండి: సుబ్రహ్మణ్య స్వామి
తమిళనాడులో రాజకీయ సంక్షోభం ఏర్పడుతున్న సమయంలో ఆ రాష్ట్ర ఇంఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నయ్ లో ఉండకుండా, మొదట ఢిల్లీకి వెళ్లిపోయారని, ఆ తరువాత ముంబయికి వెళ్లారని భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి విమర్శించారు. ‘ఆయన మహారాష్ట్రకు కూడా గవర్నర్‌గా ఉన్న విషయం నిజమే.. కానీ ప్రస్తుతం సంక్షోభం తమిళనాడులో ఉంది కదా.. ఆయన చెన్నయ్‌లోనే ఉండాలి. గవర్నర్ ప్రవర్తన బాగోలేదు. గవర్నర్ తీరు వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రమేయం ఉండవచ్చు. ఆయన రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. శశికళ నటరాజన్‌ను పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. సిట్టింగ్ సీఎం రాజీనామా చేసి శశికళే తమ నేత అని ప్రకటించారు. ఆమే సీఎం అంటూ తీర్మానం కూడా చేశారు. గవర్నర్ వెంటనే స్పందించి ప్రభుత్వ ఏర్పాటుకు శశికళను పిలవాలి. మొదట ప్రమాణ స్వీకారం చేసేలా చేసి, ఆ తర్వాత బలనిరూపణకు అవకాశం ఇవ్వాలి’ అని సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించారు.