: గవర్నర్ కావాలనే అడ్డుకుంటున్నారు: శశికళ తీవ్ర విమర్శ


తమిళనాడులో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే, గవర్నర్ విద్యాసాగర్ రావు ఉద్దేశపూర్వకంగానే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకుండా అడ్డుకుంటున్నట్టు కనిపిస్తోందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, నాలుగు రోజుల క్రితం శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన వీకే శశికళా నటరాజన్ విమర్శించారు. ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందన్న సంగతి ప్రపంచానికి తెలుసునని, అయినా, ప్రజాస్వామ్య విరుద్ధంగా గవర్నర్ ప్రవర్తిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, పన్నీర్ సెల్వం, తన వ్యక్తిగత స్వార్థంతోనే పార్టీలో సంక్షోభం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఇప్పుడాయన ఏకాకిగా మిగిలిపోయారని అన్నారు. గవర్నర్ వెంటనే చెన్నైకి వచ్చి తనతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News