: ఆటో డ్రైవర్‌ను దోచుకుని, కానిస్టేబుల్‌ను రాయితో కొట్టిన కి‘లేడీలు’ అరెస్ట్
ప్రశ్నించిన పాపానికి కానిస్టేబుల్‌ను రాయితో కొట్టి గాయపరిచిన ఇద్దరు యువతులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజేంద్రనగర్‌కు చెందిన పర్వీన్‌బేగం, షాహిన్‌బేగం పంజాగుట్ట గోకుల్ టవర్స్ వద్ద మంగళవారం రాత్రి ఓ ఆటోను అడ్డగించి, డ్రైవర్ కిశోర్‌పై దాడిచేశారు. అతడి వద్ద రూ.1200 లాక్కున్నారు. కిశోర్ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ కిశోర్ అక్కడే ఉన్న యువతులను ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన యువతులు అతడితో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా రాయితో తలపై కొట్టి పరారయ్యారు. ఆటోడ్రైవర్, కానిస్టేబుల్ ఫిర్యాదుతో యువతులపై కేసు నమోదు చేసిన పోలీసులు కి‘లేడీ’లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.