: ఢిల్లీకి మారిన పంచాయితీ...ఎమ్మెల్యేలతో హస్తినకు శశికళ
తమిళనాడు పంచాయితీ ఢిల్లీకి మారింది. ఇప్పటికే పార్టీ ఎంపీలతో ప్రధాని, రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోసం శశికళ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో శశికళ రేపు తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో హస్తినకు బయల్దేరనున్నారు. అనంతరం రాష్ట్రపతి ముందు పార్టీ ఎమ్మెల్యేలను హాజరుపర్చడం ద్వారా తన బలాన్ని ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలను రహస్య స్ధావరంలో ఉంచిన శశికళ వర్గం ఢిల్లీలో రాష్ట్రపతి ముందు బలప్రదర్శనకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఇస్తారా? లేక గవర్నర్ వద్దకు వెళ్లమని చెబుతారా? అన్న కుతూహలం రేపుతోంది. కాగా, కాసేపట్లో పన్నీర్ సెల్వం మీడియా సమావేశం నిర్వహించనున్నారు.