: రాజమహేంద్ర వరంలో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల వాగ్వాదం!


తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరంలో ఈరోజు నిర్వహించిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ, వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల వాగ్వాదంతో సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజా సమస్యలపై చర్చించాలని మేయర్ శేషసాయి చెప్పగా, వైఎస్సార్సీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా అడ్డుపడ్డారు. టీడీపీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు సమావేశానికి రాకుండా వైఎస్సార్సీపీ సభ్యులు తమకు అడ్డుపడ్డారని ఎమ్మెల్యే గోరంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, రెండు పార్టీల కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరగడంతో కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది.

  • Loading...

More Telugu News