: ముంబయి-గోవా జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ఏడుగురు యువకుల మృతి


ముంబయి-గోవా జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ఓ కారు ఒక్క‌సారిగా అదుపుత‌ప్పి చెట్టును ఢీ కొట్ట‌డంతో ఏడుగురు యువ‌కులు ప్రాణాలు కోల్పోయారు. రత్నగిరి జిల్లా సమీపంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదానికి గుర‌యిన వారిలో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా మ‌రో ముగ్గురు యువ‌కులు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందార‌ని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో వ్య‌క్తికి కూడా గాయాల‌య్యాయని, ఆ బాధితుడు ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్నాడని చెప్పారు. వీరంతా ముంబయికి చెందిన వారని, వారు గోవాకు వెళుతుండగా ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంద‌ని చెప్పారు.  

  • Loading...

More Telugu News