: అరుదైన కలయిక.. 500 మందితో ఫ్యామిలీ ఫొటో!
చైనాలో ఓ కుటుంబం అంతా కలసి ఫొటో తీయించుకుంది.. అయితే, ఫ్యామిలీ ఫోటో అంటే పది మందో, పాతక మందో కాదు.. ఏకంగా 500 మందితో ఫ్యామిలీ ఫొటో తీయించుకొని చరిత్ర సృష్టించారు. ఇటీవల జరిగిన చైనా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కలుసుకున్న ఈ అతిపెద్ద కుటుంబం గ్రూప్ ఫొటోకు పోజ్ ఇచ్చింది. ఈ కుటుంబమంతా బిజాంగ్ ప్రావిన్సులో ఓ డ్రోన్ ద్వారా ఫోటోగ్రాఫర్ జాంగ్ లియాంగ్జాంగ్ తో ఫొటో తీయించుకుంది. ఈ అరుదైన కలయిక పట్ల అందరూ ఆసక్తి కనబరిచారు. సోషల్ మీడియాలో ఈ అతి పెద్ద ఫ్యామిలీ ఫొటో చక్కర్లు కొడుతోంది.