: మసూద్ అంశంలో భారత్‌కు మరోసారి ఆగ్రహం తెప్పించిన చైనా
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి చేస్తున్న భారత్ ప్రయత్నాలకు చైనా మరోసారి అడ్డుతగిలింది. భారత్ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించిన అమెరికా ఐక్యరాజ్య సమితిలో ఆ ప్రతిపాదనను పెట్టిన విషయం తెలిసిందే. అయితే, చైనా మరోసారి తమ బుద్ధిని ప్రదర్శిస్తూ మసూద్ అజర్‌పై నిషేధం పడకుండా చేసింది. తమ నిర్ణయానికి కారణాలు చెబుతూ... మసూద్‌ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి సంతృప్తికరమైన కారణాలు లేవని చెప్పింది. అన్ని వర్గాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం కోసమే తాము దీనిని అడ్డుకున్నామని తెలిపింది.