: రహస్య ప్రాంతానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేల తరలింపు!
తమిళనాట రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్న తరుణంలో, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ క్యాంపు రాజకీయాలకు తెర తీసినట్టు సమాచారం. ఆమెకు మద్దతుగా ఉన్న 131 మంది ఎమ్మెల్యేలను ఓ హోటల్ కు తరలించినట్టు తెలుస్తోంది. శశికళ వర్గీయులు దగ్గరుండి మరీ, ఆ ఎమ్మెల్యేలను బస్సుల్లో ఎక్కించి తరలించారనే వార్తలు తమిళనాట హల్ చల్ చేస్తున్నాయి. కాగా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్ మెంట్ కు శశికళ వర్గీయులు యత్నిస్తున్నారు. రాష్ట్రపతి అపాయింట్ మెంట్ లభిస్తే తమకు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకువెళ్లే యోచనలో శశికళ ఉన్నట్టు తెలుస్తోంది.