: ఇన్నాళ్లుగా పన్నీర్ సెల్వంని చాలా మంచివాడనే అనుకున్నాం: అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి
తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో ఏర్పడుతున్న సంక్షోభం నేపథ్యంలో పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి స్పందిస్తూ చిన్నమ్మ శశికళ వెంటనే అందరూ ఉన్నారని స్పష్టం చేశారు. అమ్మ జయలలితను నమ్మినవారందరూ ప్రస్తుతం శశికళ వైపే నిలిచారని పేర్కొన్నారు. అన్నాడీఎంకే కార్యాలయమే తమ ఇల్లని వ్యాఖ్యానించారు. తమ పార్టీ తిరుగుబాటు నేత పన్నీర్ సెల్వం పేరు ఎత్తడమే తమకు ఇష్టం లేదని, తమ పార్టీని చీల్చాలని చూస్తున్నవారి గురించి పట్టించుకోబోమని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారం గురించి శశికళ ప్రకటిస్తారని చెప్పారు.
ఇన్నాళ్లుగా తాము పన్నీర్ సెల్వం చాలా మంచివాడనే అనుకున్నామని సరస్వతి వ్యాఖ్యానించారు. ఆయన ఇంత స్వార్థపరుడని తమకు ఇప్పుడే తెలిసిందని, ఆయన జయలలితకు విశ్వాసపాత్రుడే అయితే, ఇదంతా ఎందుకు చేస్తారని ఆమె ప్రశ్నించారు.