: బ్యాటింగ్, బౌలింగ్ లో పటిష్ఠంగా ఉన్నాం: కోహ్లీ
రేపటి నుంచి హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా ప్రారంభం కానున్న టెస్టు మ్యాచ్ లో గెలుపు తమదేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్వాసం వ్యక్తం చేశాడు. హైదరాబాదులో కోహ్లీ మాట్లాడుతూ, ప్రతి మ్యాచ్ ను ఛాలెంజ్ గా తీసుకుంటామని అన్నాడు. జట్టులోని ఆటగాళ్లంతా ఆనందంగా, ఆటతీరుపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని చెప్పాడు. ప్రతి ఆటగాడు ఫిట్ నెస్ కోసం ప్రత్యేకంగా శ్రమిస్తున్నారని తెలిపాడు. బంగ్లాదేశ్ తో జరిగే టెస్టులో కరుణ్ నాయర్ స్థానంలో అజింక్యా రహానేకు స్థానం కల్పించామని చెప్పాడు. కాగా, గత సిరీస్ లో ట్రిపుల్ సెంచరీతో కరుణ్ నాయర్ రాణించిన సంగతి తెలిసిందే. రహానే కూడా గత కొన్ని సిరీస్ లుగా జట్టులో భాగమైనప్పటికీ స్థానం దక్కని సంగతి తెలిసిందే.