: నా వెనుక మీరు...పన్నీర్ వెనుక స్టాలిన్...మద్దతివ్వండి: శశికళ ఆవేదన


తమిళనాట రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. గత రాత్రి మెరీనా బీచ్ లో జయలలిత సమాధి వద్ద ప్రారంభమైన రాజకీయ క్రీడ, శశికళ సమావేశంతో ఒక రూపు తెచ్చుకుంది. ఈ క్రమంలో శశికళ వ్యతిరేక వర్గానికి అనధికారికంగా పన్నీర్ సెల్వం నాయకత్వం వహస్తున్నారు. ఈ నేపథ్యంలో శశికళ నటరాజన్ ఏర్పాటు చేసిన సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు.

ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ, 'నా వెనుక మీరంతా (ఎమ్మెల్యేలు) ఉన్నారు...పన్నీర్ సెల్వం వెనుక ప్రతిపక్ష నేత స్టాలిన్ ఉన్నాడు...పార్టీని రక్షించుకోవాలంటే నాకు మద్దతునివ్వాలి' అని కోరారు. పార్టీని కాపాడుకుంటూ, తన స్నేహితురాలి ఆకాంక్షల సాధనకు అండగా నిలవాల్సిన తరుణం ఇదేనని ఆమె తెలిపారు. దీంతో ఎమ్మెల్యేలంతా ఆమెకు అండగా నిలిచేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News