: ఏడు అంతస్తుల పై నుంచి దూకిన భార్య... అనూహ్యంగా జుట్టందుకొని రక్షించిన భర్త


భర్తతో గొడ‌వ‌పెట్టుకున్న ఓ మ‌హిళ ఏడంత‌స్తుల బిల్డింగ్‌పై నుంచి దూకేందుకు సిద్ధ‌మైంది. చివ‌ర‌కు అన్నంత ప‌నీ చేసింది. అయితే ఆమె దూకిన వెంట‌నే భ‌ర్త చేతికి ఆ మ‌హిళ‌ జుట్టు చిక్కింది. అంతే, ఆ జుట్టు సాయంతోనే ఆయ‌న ఆమెను పైకి లాగాడు. ఈ ఘ‌ట‌న‌ను స్థానికులు ఊపిరి బిగ‌ప‌ట్టి చూశారు. తాజాగా చైనాలోని షాంగ్జీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఏడంత‌స్తులపైన ఉన్న వారిని రక్షించేందుకు అక్కడికి వచ్చిన పోలీసులను సైతం ఈ ఘ‌ట‌న‌ కంగారుపెట్టింది. కాంగ్‌, లీయూ దంపతులు షాంగ్జీలోని ఓ ఏడంతస్తుల భవనంలోని చివరి ఫ్లోర్‌లో నివ‌సిస్తున్నారు.

ఒత్తిడికి గురైన కాంగ్‌ కోపంతో ఆత్మహత్య చేసుకునేందుకు పరుగెత్తగా ఆమె వెంటే ఆమె భర్త కూడా పరుగెత్తాడు. చివ‌రికి ఆమె బిల్డింగ్ పై నుంచి దూక‌గా అనూహ్యంగా భర్త చేతికి ఆమె జుట్టు అందింది. కానీ, ఆమె త‌న‌ను వ‌దిలేయాల‌ని, చ‌నిపోతాన‌ని భ‌ర్త‌ను వేడుకొంది. చివ‌రికి ఆమెను భ‌ర్త పైకి లాగే ప్రయత్నం చేశాడు. పోలీసులు కూడా బిల్డింగ్ పైకి చేరుకొని సాయం చేసి కాంగ్‌ కిందపడకుండా రక్షించారు. సుమారు అరగంటపాటు ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ప్ర‌య‌త్నంలో ఓ పోలీసు భుజానికి గాయాలయ్యాయి. మనిషి జుట్టుకు దాదాపు 12 టన్నుల బరువును ఆపగలిగే సామ‌ర్థ్యం ఉంటుంది.

  • Loading...

More Telugu News