: శ్రీముఖితో నా అఫైర్ గురించి ఏమైనా రాసుకోండి: యాంకర్ రవి


శ్రీముఖితో తన అఫైర్ గురించి ఏమైనా రాసుకోవచ్చని టాలీవుడ్ యాంకర్ రవి తెలిపాడు. తెలుగు బుల్లితెరపై శ్రీముఖి, రవి జంట బిజీ యాంకర్లుగా దూసుకుపోతున్నారు. వీరిద్దరూ చేసే కార్యక్రమాలపై ఫిర్యాదులున్నప్పటికీ వారి అడల్ట్ కామెడీని వీక్షించేవారు కూడా భారీగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో రవి సోషల్ మీడియాలో అభిమానులతో ఛాటింగ్ కు వచ్చాడు. ఈ సందర్భంగా శ్రీముఖితో అఫైర్ గురించి ప్రశ్నించగా, 'బుద్ధున్నోడెవడైనా శ్రీముఖిని ప్రేమిస్తాడా?' అన్నాడు.

'నువ్వు, శ్రీముఖి చేస్తున్న ఓవర్ యాక్షన్ ను చూడలేకపోతున్నాంరా అయ్యా?' అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా, 'నీ చేతిలో రిమోట్ ఉందిరా అయ్యా' అంటూ రవి ఘాటుగా సమాధానమిచ్చాడు. మీ కార్యక్రమంలో బూతులెక్కువుంటున్నాయని ఒక నెటిజన్ విమర్శించగా, అన్ని కార్యక్రమాలు ఒకేలా ఉండవని, ఆ కార్యక్రమంలో బూతులు ఎక్కువయ్యాయన్న సంగతి తనకు తెలుసని అన్నాడు. తమ అఫైర్ గురించి ఎంత ఎక్కువ రాస్తే, తాము అంత ఫేమ్ లో ఉంటామని రవి చెప్పాడు. 

  • Loading...

More Telugu News