: ఆసక్తి రేపుతున్న అఖిల్ అక్కినేని ‘వీడెవడు?’ ట్వీట్!
యువ హీరో అఖిల్ అక్కినేని ‘వీడెవడు??’ అంటూ ఒక పోస్టర్ ను ట్వీట్ చేయడం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పోస్టర్ వెనుకకు తిరిగి నిలబడ్డ హీరోను ఉద్దేశిస్తూ, ‘అతను ఎవరో ఊహించండి?’ అని పేర్కొన్న అఖిల్, మీకు ఒక చిన్న ‘క్లూ’ కూడా ఇస్తున్నానంటూ..‘అతను నా టీమ్ మేట్.. ఈ వేసవి కాలంలో, ఏప్రిల్ లో ఈ చిత్రం విడుదల కానుంది. ఆల్ ది బెస్ట్!’ అంటూ ఆ ట్వీట్ లో అఖిల్ తెలిపాడు. కాగా, అఖిల్ ఇచ్చిన క్లూ ప్రకారం... అతని టీమ్ మేట్, హీరో నితిన్ అని తెలుస్తోంది.