: శ్రీశాంత్ కు సింపుల్ గా బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పిన సెహ్వాగ్!
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసే ట్వీట్లు ఎంత ప్రజాదరణ పొందాయో, ముఖ్యంగా నెటిజన్లను ఎంతగా ఆకర్షించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమయానుసారంగా, ట్వీట్లు చేసే వీరూ, తాజాగా, క్రికెటర శ్రీశాంత్ కు బర్త్ డే విషెస్ తెలిపాడు. సెహ్వాగ్ ట్వీట్ అంటే, పంచ్ లు, హాస్యం, తనదైన పదాలు ఉంటాయి. అయితే, శ్రీశాంత్ కు చేసిన ట్వీట్ మాత్రం ‘హ్యాపీ బర్త్ డే శ్రీశాంత్. ఎంజాయ్’ అని చాలా సింపుల్ గా ఉంది. దీంతో పాటు, 2007 టీ 20 ప్రపంచకప్ లో ఔట్ కోసం అప్పీల్ చేస్తున్న శ్రీశాంత్ ఫొటోను పోస్ట్ చేశాడు. వీరూ ట్వీట్ లో ఏదో ప్రత్యేకతను ఆశించే నెటిజన్లకు అది కనపడకపోవడంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు.