: తమిళనాడు రాజకీయ పరిణామాల నేపథ్యంలో వచ్చిన పాట.. సోష‌ల్‌మీడియాలో హల్‌చ‌ల్


తమిళనాడు రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్న విష‌యం తెలిసిందే. కొన్ని రోజుల క్రిత‌మే ఆ రాష్ట్ర అధికార పార్టీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ న‌జ‌రాజ‌న్‌ను ఎన్నుకున్న నేత‌లు తాజాగా ఆమెను ముఖ్య‌మంత్రిని చేయాల‌ని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైకు చెందిన సంగీతకారిణి సోఫియా అష్రఫ్‌ కంపోజ్‌ చేసిన పాట సోషల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఆమె ఆదివారం తమిళనాడులోని  పొయెస్‌ గార్డెన్‌ వీధుల్లో ఈ పాటను ప్రదర్శించి, ఆ సంద‌ర్భంగా తీసిన వీడియోను సోమాజిక మాధ్య‌మాల్లో పెట్టారు. దానికి క్యాప్ష‌న్‌గా ‘ప్రజాస్వామ్యం మరణించింది’ అని పేర్కొన్నారు.

అందులో ఆమె పాట పాడుతూ... ఓట్లు పొందకుండానే ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు చేసుకుంటున్నార‌ని, విశ్వసనీయత లేకుండా తప్పుడు ప్రమాణాలు చేస్తున్నార‌ని పేర్కొంది. ఇక్కడ ఎవరూ మంచి వారు కారు.. నా ఓటు నీకు కాదు.. అంటూ పాట ఆల‌పించింది. తాము పోయెస్ గార్డెన్‌లో ఈ ప్రదర్శన చేప‌డుతుండ‌గా ఓ పోలీసు అధికారి త‌మ‌ను ఆపడానికి ప్రయత్నించారని కూడా ఆమె త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొంది. తన వస్త్రధారణ సరిగా ఉన్నా మందలించాడని చెప్పింది.


  • Loading...

More Telugu News