: తమిళనాడులో కొనసాగుతున్న ఉత్కంఠ.. మరో అధికారి రాజీనామా
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ రోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలనుకున్న శశికళ నటరాజన్‌కు న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయి. మరోవైపు ఈ రోజు మరో ప్రభుత్వాధికారి రాజీనామా చేశారు. సీఎంవోలో ఓఎస్డీగా ఉన్న శాంతా షీలా నాయర్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. కాగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్ ప్రమాణస్వీకారం చేయకుండా ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. మరికాసేపట్లో సుప్రీంకోర్టులో ఈ పిల్ విచారణకు రానుంది.
న్యాయనిపుణుల సలహా మేరకే శశికళ ప్రమాణ స్వీకరణ కార్యక్రమం విషయమై ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తోన్న ఆ రాష్ట్ర ఇన్ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావు మరోరెండు రోజుల పాటు చెన్నయ్ పర్యటనను వాయిదా వేసుకున్నారు.