: ఆవేశాన్ని అదుపు చేసుకోలేక బంతితో అంపైర్‌ను బలంగా కొట్టిన టెన్నిస్ స్టార్‌!


ఒట్టావాలో జ‌రుగుతున్న డేవిస్ కప్‌లో కెనడా టెన్నిస్ స్టార్ డెనిస్ షపోవాలవ్ ప్ర‌ద‌ర్శించిన అస‌హ‌నం అంపైర్‌ను గాయాల‌పాలు చేసింది. కోర్టులో త‌న ప్రత్యర్థి బ్రిటన్ ఆటగాడు కేల్ ఎడ్మండ్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో డెనిస్ వరుసగా రెండు సెట్లు ఓడిపోయాడు. దీంతో త‌న ఆవేశాన్ని టెన్నిస్‌ బంతిపై చూపిస్తూ అంపైర్ గాబస్ కూర్చున్న స్టాండ్ వైపు బ‌లంగా విసిరాడు. ఆ బంతి కొద్దిగా పైకి వెళ్లి అంపైర్ ముఖానికి తాకింది. ఆ దెబ్బకు అంపైర్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా అత‌డి ఎడమ కన్నుపై తీవ్రంగా వాపు వ‌చ్చిన‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌తో డెనిస్ షపోవాలవ్ డేవిస్ కప్ నుంచి తొల‌గించారు.

  • Loading...

More Telugu News