: ఆ 'డాక్టరు బామ్మ' వయస్సు 89... ఎలాంటి వ‌ణుకూ లేకుండా రోజుకు 4 సర్జరీలు చేస్తోంది!


ఆ బామ్మ వయసు 89 ఏళ్లు. కానీ, ఈ వ‌య‌సులోనూ ఉర‌క‌లేసే ఉత్సాహంతో ప‌నిచేస్తోంది. ప‌ని అంటే సాధార‌ణ ప‌నికాదు. వృత్తిరీత్యా వైద్యురాలు అయిన ఆమె... ఇప్ప‌టికీ సర్జరీలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆమె చేసిన స‌ర్జ‌రీల సంఖ్య దాదాపు 10 వేలు. 60 ఏళ్లు రాగానే కృష్ణారామా అని కూర్చునే వారికి భిన్నంగా ప్ర‌వ‌ర్తిస్తోంది ఈవిడ. పాతికేళ్లు వచ్చినా ఏ పనీ చేయ‌కుండా బద్ధకంగా తిరిగే యువ‌త‌కు త‌న హుషారైన‌ ప‌ని తీరుతో స్ఫూర్తిగా నిలుస్తోంది.

రష్యాలోని మాస్కో ర్యాజన్ సిటీ ఆసుప‌త్రికి వెళ్లి చూస్తే లెవుష్కినా అనే బామ్మ క‌న‌ప‌డుతుంది. ఒంటిపై తెల్ల‌ని చొక్కా, మెడ‌లో స్టెత‌స్కోప్‌, క‌ళ్ల‌కు క‌ళ్ల‌ద్దాలు పెట్టుకొని న‌వ్వుతూ ఉంటుంది. ఈ వయస్సులోనూ ఆమె ఎలాంటి వ‌ణుకూ లేకుండా రోజుకు 4 సర్జరీలు చేస్తుంది ఆ బామ్మ‌. 1950లలో డాక్టర్‌గా త‌న ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆమె ఇప్ప‌టికీ త‌న ఉద్యోగాన్ని వ‌దులుకోలేక‌పోతుంది. ఉద్యోగ‌మే జీవితంలా చ‌క‌చ‌కా ప‌నిచేస్తోంది. అందులోనూ త‌న ప్ర‌తిభ చాటుకుంటోంది. ఆమె చేసిన‌ ఏ సర్జరీ కూడా ఇప్ప‌టివ‌ర‌కు ఫెయిల్ కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఆమె ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయస్సు గల వర్కింగ్ సర్జన్‌గా రికార్డు నెల‌కొల్పింది. విశేషం ఏమిటంటే, త‌న జీవితం మొత్తాన్ని వృత్తికే అంకింతం చేస్తోన్న‌ ఈ బామ్మకు పెళ్లికాలేదు. అంగవైకల్యంతో బాధ‌ప‌డుతున్న‌ తన మేనల్లుడితో కలిసి నివాసం ఉంటోంది. తాను త‌న వృత్తిని ఎన్న‌డూ ఒదులుకోబోన‌ని, త‌న చివ‌రి శ్వాస విడిచే వ‌ర‌కు స‌ర్జ‌న్‌గా ప‌నిచేస్తూనే ఉంటాన‌ని చెబుతోంది.

  • Loading...

More Telugu News