: గుండెపోటు వల్లే జయ చనిపోయారు.. బీపీ, షుగర్ వల్ల కోలుకోలేకపోయారు: రిచర్డ్ బేలే
గుండెపోటు రావడం వల్లే జయలలిత చనిపోయారని ఆమెకు చికిత్స అందించిన లండన్ వైద్యుడు రిచర్డ్ బేలే స్పష్టం చేశారు. అధిక రక్తపోటు, షుగర్ ఉండటం వల్ల ఆమె త్వరగా కోలుకోలేకపోయారని ఆయన తెలిపారు. జయలలితకు అత్యున్నత వైద్యం అందించామని... అయినా ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. చెన్నైలోని అపోలో వైద్యులతో కలసి రిచర్డ్ బేలే మీడియా ముఖంగా జయ మరణం పట్ల వివరణ ఇచ్చారు. జయను ఆసుపత్రిలో చేర్పించే సమయానికే ఆమె అవయవాలు దెబ్బతిన్నాయని తెలిపారు. అపోలో వైద్యులు మాట్లాడుతూ, జయ ఆరోగ్యంపై శశికళకు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చామని వెల్లడించారు.