: ఎన్టీఆర్ తో క‌య్యం.. బాల‌కృష్ణతో వియ్యం ఆడ‌తారు: చంద్రబాబుపై జ‌గ‌న్ చురకలు


చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి అయితే చాలు, ఆయ‌న‌తో పాటు క‌ర‌వు వ‌చ్చేస్తుందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సెటైర్ వేశారు. అనంతపురం జిల్లాలోని హంద్రీనీవా ద్వారా ఆయకట్టుకు సాగునీటిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఉర‌వ‌కొండ‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన మ‌హాధ‌ర్నాలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. క‌ర‌వు వ‌చ్చి రైతులు అష్టకష్టాలు పడుతున్నా చంద్ర‌బాబు నాయుడికి మాత్రం ఇవేం ప‌ట్ట‌వని జగన్ విమ‌ర్శించారు. నాలుగు రోజుల్లో క‌ర‌వుని జ‌యించేశా‌న‌ని చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు చేస్తున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. ‘చంద్ర‌బాబు నాయుడిలో ఉన్న గుణ‌గ‌ణాలు ఏంటో తెలుసా? కేంద్రంతో స్నేహం చేస్తారు.. రాష్ట్రంతో యుద్ధం చేస్తారు. కాంట్రాక్ట‌ర్ల‌తో స్నేహం  చేస్తారు.. రైతుల‌తో యుద్ధం చేస్తారు.. ఎన్టీఆర్ తో క‌య్యం... బాల‌కృష్ణ తో వియ్యం ఆడతారు’ అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News