: ఎన్టీఆర్ చరిత్రను సినిమాగా తీయబోతున్నా: కీలక ప్రకటన చేసిన బాలకృష్ణ
ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీయనున్నట్టు హీరో బాలకృష్ణ ప్రకటించారు. నేడు తన అల్లుడు లోకేష్ తో కలసి నిమ్మకూరులో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ చరిత్రను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని కోరిన బాలయ్య, ఎన్టీఆర్ పై సినిమా త్వరలోనే ప్రారంభమవుతుందని తెలిపారు. ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం, నిమ్మకూరులో తలపెట్టిన 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ ఆశయాల మేరకే చంద్రబాబు పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. నిమ్మకూరును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా లోకేష్ వ్యాఖ్యానించారు. కులం, మతం పేరిట కొందరు రాజకీయాలు చేస్తున్నారని, వారి కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ర్యాంకుల్లో అట్టడుగున ఉన్నాయని, హోదాతో పరిశ్రమలు రావన్న విషయం ఈ ర్యాంకులను చూస్తేనే తెలుస్తోందని అన్నారు.