: జయలలిత ఎలా చనిపోయారు?... నేడు వెల్లడించనున్న లండన్ వైద్యుడు రిచర్డ్ బెలే
దాదాపు రెండున్నర నెలల పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది చివరికి మరణించిన జయలలిత గురించిన కీలక సమాచారం మరికాసేపట్లో వెల్లడి కానుంది. ఆమె ఆసుపత్రిలో చేరిన తరువాత జరిగిన వైద్యంపై సమాచారం అత్యంత గోప్యంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆమెకు చికిత్స చేసేందుకు వచ్చిన లండన్ వైద్య నిపుణుడు రిచర్డ్ బెలే, నేటి మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేకంగా మీడియాతో సమావేశం కానున్నట్టు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఈ మేరకు మీడియాకు ఆహ్వానాలు అందాయి. జయలలిత మరణం వెనకున్న కారణాలను ఆయన స్వయంగా వెల్లడిస్తారని సమాచారం.