: వంద కోట్ల క్లబ్ లో చేరిన ‘కాబిల్’!
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, నటి యామీ గౌతమ్ నటించిన ‘కాబిల్’ చిత్రం రూ.100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టినట్టు, దేశ వ్యాప్తంగా రూ.106.2 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. జనవరి 25న విడుదలైన ‘కాబిల్’ నిన్న రూ.9.22 కోట్లు వసూలు చేయడంతో వంద కోట్లను దాటినట్లు చిత్ర నిర్మాత, హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ పేర్కొన్నారు. కాగా, అంథుల ప్రేమకథతో తెరకెక్కించిన ‘కాబిల్’ చిత్రానికి దర్శకుడు సంజయ్ గుప్తా.