: అమెరికాలోకి వెల్లువలా వచ్చి పడుతున్న ఆ ఏడు దేశాల ముస్లింలు
ఏడు ముస్లిం దేశాలకు చెందిన ప్రజలను అమెరికాలో కాలు మోపనీయకుండా అధ్యక్షుడు ట్రంప్ తీసుకువచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై స్టే విధించిన నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా అమెరికాకు వెళ్లిపోవాలని, ఈ ఏడు దేశాల్లో గ్రీన్ కార్డు, చెల్లుబాటయ్యే వీసాలున్నవారు పరుగులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. శనివారం సాయంత్రం నుంచి లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, న్యూయార్క్, డల్లాస్ తదితర విమానాశ్రయాల్లో ఇరాన్ తదితర దేశాల నుంచి వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
పలు ప్రాంతాల నుంచి అమెరికాకు టికెట్ డిమాండ్ అధికంగా ఉండటంతో ప్రత్యేక విమాన సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. ఖతార్ ఎయిర్ వేస్, ఎతిహాద్ ఎయిర్ వేస్, ఎయిర్ ఫ్రాన్స్, లుఫ్తాన్సా తదితర ఎయిర్ లైన్స్ కంపెనీలు, 7 ముస్లిం దేశాలకు చెందిన వారు తమ విమానాలు ఎక్కవచ్చని స్పష్టం చేశాయి. తెహ్రాన్ నుంచి అధిక సంఖ్యలో ప్రజలు అమెరికాకు ప్రయాణాలు కడుతున్నారని తెలుస్తోంది.